Advertisement

8. దేవుడు సర్వాంతర్యామా...? || Devudu sarvantharyaamaa? || truth seeker

8. దేవుడు సర్వాంతర్యామా...? || Devudu sarvantharyaamaa? || truth seeker దేవుడు సర్వాంతర్యామా...? || Devudu sarvantharyaamaa? || truth seeker

ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికి వందనాలు,
ఈ మధ్య నేను చాల చోట్ల మన దేవుడైన యెహోవా సర్వాంతర్యామి అని వింటున్నాను..
దేవుడిని అనేకమంది తమ ప్రసంగాలలో సర్వాంతర్యామి అని సంబోధిస్తున్నారు మరియు ఆ పదాన్ని ఉపయోగించి పాటలు కూడా రాస్తున్నారు..

ఇంతకీ మనదేవుడు సర్వాంతర్యామినా కాదా అన్న విషయాన్నీ తెలుసుకుందాం...
మన దేవుడు సర్వాంతర్యామా కాదా అన్న విషయాన్నీ తెలుసుకోవడానికి ముందు అసలు సర్వాంతర్యామి అన్న పదానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం...

సర్వాంతర్యామి అంటే సమస్తములోను అంతర్భాగమై ఉన్నాడు అని అర్ధం..
ఉదాహరణకు దేవుడు ఒక చెట్టులో ఉంటాడు, రాయిలో ఉంటాడు.., జంతువులో ఉంటాడు, ఇలా ఈ సృష్టిలో కనిపించే ప్రతి వస్తువులోను దేవుడు అంతర్భాగమై ఉంటాడు అని అర్ధం..

ఇది హైందవుల ఆలోచన.. అందుకే వారు ప్రతి దాన్ని దైవంగా కొలుస్తారు.. వాళ్ళ దేవుడిని సర్వాంతర్యామిగా భావిస్తారు..ఇది విగ్రహారాధనను సమర్దిస్తుంది

అయితే క్రైస్తవుల దేవుడు ఇలా ఉండడు.. దేవుడు అన్నిటిలో అంతర్భాగమై ఉంటాడు అన్న విషయాన్ని వాక్యం వ్యతిరేకిస్తుంది.. ఎందుకంటే వాక్యం విగ్రహారాధనను వ్యతిరేసుకిస్తుంది.. అందుకే క్రైస్తవులు సర్వాంతర్యామి అన్న పదాన్ని వాడకూడదు..

అపొస్తలుల కార్యములు 17 :28 వచనంలో పౌలు ఈ విధం గ చెప్తున్నాడు..
మానమాయనయందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము

ఈ సృష్టి అంత దేవునిలో అంతర్భాగమై ఉంది కానీ ఈ సృష్టిలో దేవుడు అంతర్భాగమై లేడు..
అయన అనంతుడైన దేవుడు.. అనంతంలో పరిమితం ఇమిడి ఉంటుంది కానీ, పరిమితంలో అనంతం ఎప్పటికి అంతర్భాగమై ఉండలేదు...

మనము ఆయనలో అంతర్భాగమై ఉన్నాము తప్ప ఈ సృష్టిలో అయన అంతర్భాగమై లేడు..

మరి దేవుడు సర్వాంతర్యామి కాకపోతే యేమని పిలవాలి, అయన అన్నిచోట్లా ఉంటాడు కదా అన్న సందేహం మీకు రావొచ్చు..
అవును, మన దేవుడు అన్ని చోట్ల ఏక కాలంలో ఉండగలడు,

కీర్తనలు 139 :7 లో
దావీదు ఈ విధంగా అంటున్నాడు..

నీ ఆత్మనుండి నేనెక్కడికి పోవుదును?
నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును?
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు.
నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు.
నేను వేకువ రెక్కలు కట్టుకొని, సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును.

దేవుడు అన్ని చోట్ల ఏకకాలంలో ఉంటాడు కాబట్టి ఆయన్ని పిలవడానికి సర్వ వ్యాప్తి అనే పదం వాడాలి తప్ప సర్వాంతర్యామి అనే పదం వాడకూడదు.

అయన ఏక కాలంలో అన్ని చోట్ల ఉండగలిగే దేవుడు, మన దేవుడు అనంతుడైన దేవుడు, మన దేవుడు సర్వము వ్యాపించి ఉన్న దేవుడు.. కాబట్టి ఇకనుండి మన దేవుణ్ణి సర్వాంతర్యామి అని విగ్రహారాధనను సమర్ధించే పదంతో కాకుండా, సర్వ వ్యాప్తి అనే పదాన్ని ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను..

దేవుడు మిమ్మును దీవించును గాక..

ఆమెన్...

for more videos: please pray, share & subscribe now
like us on:

God bless you

Note: Please dont upload this video in your channels

sarvantharyaami,God,omni prescence,every where,truth seeker,God is omni presence,Jesus christ,Acts 17:28,psalms 139:7,Truth seeker channel,Truth seeker channel telugu,Telugu apologetics,Devudu sarvantharyaama,sarva vyaapthi,devudu sarva vyaapthi,Bible,apologetics in telugu,true gospel,telugu audio bible,telugu mp3 bible,bible in telugu,telugu christian apologetics,holy spirit,holy scriptures,

Post a Comment

0 Comments